![]() |
![]() |

ఆహా ఓటిటి వేదిక మీద ప్రసారమవుతున్న తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2 ఈ వారం మంచి పోటాపోటీగా సాగింది. ఈ షోకి సింగర్ స్మిత గెస్ట్ గా వచ్చింది. సింగర్ గా, యాక్టర్ గా, బిజినెస్ వుమన్ గా ఈమె ప్రస్థానం గురించి అందరికీ తెలుసు. విజయవాడలో పుట్టి పెరిగిన స్మిత "హైరబ్బా, మసక మసక చీకటిలో" లాంటి పాప్ సాంగ్స్ తో ఒక ట్రెండ్ సృష్టించింది. ప్లే బాక్స్ సింగర్ అయ్యాక "సై, అనుకోకుండా ఒక రోజు, ఆట, ఛత్రపతి" వంటి మూవీస్ లో పాపులర్ సాంగ్స్ పాడి ఎంటర్టైన్ చేసింది. అలాగే స్మిత నటిగా మల్లీశ్వరి, ఆట వంటి మూవీస్ లో కూడా నటించింది. ప్రస్తుతం సోనీలో "నిజం విత్ స్మిత" అనే టాక్ షోలో కనిపిస్తోంది. అలాంటి స్మిత ఇప్పుడు తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2 మదర్స్ స్పెషల్ ఎపిసోడ్ లో మెరిసింది. ఇందులో "చంటయినా, బుజ్జాయినా " సాంగ్ పాడి డాన్స్ చేసి అలరించింది. అలాగే ఈ షోకి వచ్చిన మదర్స్ అందరికీ లాస్ట్ లో గిఫ్ట్స్ కూడా అందించింది. ఇక ఎపిసోడ్ కి వస్తూనే స్టార్టింగ్ లో ఒక కొత్త అనౌన్స్మెంట్ చేసింది స్మిత.
ఎవరైతే బొమ్మ బ్లాక్ బస్టర్ పెర్ఫార్మెన్స్ ఇస్తారో వాళ్లకు తన నెక్స్ట్ ఆల్బంలో పాడే ఛాన్స్ ఇస్తానని చెప్పింది. అలా ఈ షో మొత్తం కూడా కంటెస్టెంట్స్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేసింది. ఫైనల్ గా షో మొత్తం పూర్తయ్యాక తన నెక్స్ట్ ఆల్బం కోసం సౌజన్య, శృతిని సెలెక్ట్ చేసుకున్నట్లు అనౌన్స్ చేసింది. ఇకపోతే ఈ వారం చక్రపాణి, హితేష్ సాయి, లాస్య ప్రియా లీస్ట్ స్కోర్స్ తో బాటమ్ త్రిలో నిలిచారు. చివరిగా పబ్లిక్ వోటింగ్ ప్రకారం వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా ఈ షోలోకి ఎంట్రీ ఇచ్చిన హితేష్ సాయి ఎలిమినేట్ అయ్యాడు. చక్రపాణి, లాస్య ప్రియా ఈ వారం సేఫ్ జోన్ లోకి వెళ్లిపోయారు. "బేసిక్ మ్యూజిక్ నాలెడ్జి అనేది ఉండాలి...నీ వాయిస్ చాలా బాగుంది. ఇంకా ప్రాక్టీస్ చేస్తే చక్కగా పాడొచ్చు" అంటూ హితేష్ లోని పాజిటివ్స్ ని, నెగటివ్స్ ని చెప్పారు జడ్జెస్ కార్తిక్, తమన్.
![]() |
![]() |